హన్మకొండ కల్చరల్: అంతర్జాతీయ నాట్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ శాసీ్త్రయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వరంగల్‌కు చెందిన పేరిణి నాట్య గురువు గజ్జెల రంజిత్‌కు నాట్యఘృణి అవార్డు ప్రదానం చేశారు. ఈ మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ కాకినాడలో జరిగిన అంతర్జాతీయ నాట్య దినోత్సవ వేడుకల్లో గత 28 ఏళ్లుగా పేరిణి, ఆంధ్రనాట్యం, శాసీ్త్రయ నృత్య విద్యలో మెలకువలను నేర్పుతూ విద్యార్ధులను కళాకారులుగా తీర్చిదిద్దుతూ, సంప్రదాయ బాణీలను పెంపొందిస్తూ నాట్యకళకు చేస్తున్న కృషికిగాను నిర్వాహకులు గజ్జెల రంజిత్‌కు నాట్యఘృణి అవార్డు ప్రదానం చేశారు.


