కేంద్ర పురస్కారానికి నారాయణతండా ఎంపిక | - | Sakshi
Sakshi News home page

కేంద్ర పురస్కారానికి నారాయణతండా ఎంపిక

May 1 2026 4:10 AM | Updated on May 1 2026 4:10 AM

–అజ్మీరా నిర్మల, సర్పంచ్‌

పచ్చదనం, పరిశుభ్రతలో

95.71 శాతం గ్రేడ్‌ పాయింట్లు

దుగ్గొండి: పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఏటా ఉత్తమ పంచాయతీలకు అచీవర్‌ అవార్డులు అందిస్తోంది. ఈ మేరకు మండలంలోని నారాయణతండా గ్రామం పచ్చదనం, పరిశుభ్రతలో 95.71 శాతం గ్రేడ్‌ పాయింట్లు సాధించి అచీవర్‌ అవార్డుకు ఎంపికై ంది. 252 నివాస గృహాలు, 553 మంది ఓటర్లు, 702 మంది జనాభా కలిగి ఉన్న గిరిజన తండా.. 2018లో తిమ్మంపేట నుంచి విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించింది. నాటినుంచి తండాను అభివృద్ధి చేసుకోవాలనే దృఢ సంకల్పంతో గ్రామస్తులు ముందుకు సాగుతున్నారు. రెండు ధపాలుగా జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగానే పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్నారు. మొదటి సర్పంచ్‌గా కొర్ర మధు, రెండో సర్పంచ్‌గా అజ్మీరా నిర్మల ఎన్నికయ్యారు. ఇద్దరు కూడా విద్యావంతులే. గ్రామంలో ప్రతి వీధి, ప్రతి ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి. వీధుల వెంట పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పచ్చని పంట పొలాల పక్కన ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం యువతకు ఆహ్వానం పలుకుతోంది. పరిశుభ్రతకు మారుపేరుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. అచీవర్‌ అవార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఎంపికై న మూడు గ్రామాల్లో నారాయణతండా ఒకటి.

తండాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడక ముందు అనేక సమస్యలు ఉండేవి. దేనికై నా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమ్మంపేటకు వెళ్లాల్సి వచ్చేది. పంచాయతీగా ఏర్పడిన అనంతరం నారాయణతండాలో అందరం కలిసి సౌకర్యాలు కల్పించుకున్నాం అందరి సహకారంతో తండాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చదిద్దడానికి కృషిచేస్తా

Advertisement
 
Advertisement
Advertisement