ఈజీఎస్‌ పనులు ముమ్మరంగా కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

ఈజీఎస్‌ పనులు ముమ్మరంగా కొనసాగించాలి

Apr 29 2026 7:12 AM | Updated on Apr 29 2026 7:12 AM

గీసుకొండ: జిల్లాలోని ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో 100 మంది కూలీలతో ఈజీఎస్‌ పనులు ముమ్మరంగా కొనసాగించాలని డీఆర్‌డీఓ కె.నాగపద్మజ అధికారులకు సూచించారు. మంగళవారం మండంలోని ఊకల్‌, నందనాయక్‌ తండా, కొమ్మాల, కొనాయిమాకుల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, నర్సీలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ నాగపద్మజ మాట్లాడుతూ ఏప్రిల్‌, మే నెలలో లేబర్‌ బడ్జెట్‌ పూర్తిగా చేరేలా పనులు చేయాలన్నారు. ఫిబ్రవరి 2026 నుంచి నేటి వరకు పని చేసి పెండింగ్‌ ఉన్న వేతనాలు ఈ వారంలో వస్తాయని, ఎండతీవ్రత తక్కువ ఉన్నప్పుడే పనులకు హాజరై కొలతల ప్రకారం పనులు పూర్తిగా చేసుకోవాలని వివరించారు. ఎన్‌ఎంఎంఎస్‌ అటెండెన్స్‌లో రెండు ఫొటోలు తప్పక దిగాలని సూచించారు. పనులు జరిగే ప్రదేశంలో నీడ, నీరు, ప్రధమ చికిత్స సౌకర్యాలు గ్రామ పంచాయితీ ద్వారా కల్పించాలని తెలిపారు. అనంతరం కూలీలకు ఓఆ ర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఊకల్‌ సర్పంచ్‌ సుభాష్‌, ఉప సర్పంచ్‌ సుధాకర్‌, నందనాయక్‌ తండా సర్పంచ్‌ భూక్యా వీరేందర్‌, కార్యదర్శి లావణ్య, కొమ్మాల సర్పంచ్‌ కె.యమున, కొనాయిమాకుల సర్పంచ్‌ వజ్ర రాజు, ఏపీఓ చంద్రకాంత్‌, ఈసీ శ్రీలత, టీఏలు సత్యనారాయణ సింగ్‌, సుష్మ, క్లస్టర్‌ టీఏ సురేష్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు నర్సింగరావు, స్వామి చౌహన్‌, ప్రభాకర్‌, రాజ్‌ మహ్మద్‌, మెట్లు తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌డీఓ నాగపద్మజ

Advertisement
 
Advertisement
Advertisement