భాషా నైపుణ్యాలను పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

భాషా నైపుణ్యాలను పెంపొందించాలి

Apr 5 2026 7:24 AM | Updated on Apr 5 2026 7:24 AM

అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి

నర్సంపేట: పాఠశాలస్థాయి నుంచే విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించాలని అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం భారతీయ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో భాషా నైపుణ్యాలు, గొప్పతనాన్ని విస్తృతపర్చాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌ మాట్లాడుతూ భాషలు మన భావాలను వ్యక్తపరిచే ముఖ్యమైన సాధనాలన్నారు. భారతీయ భాషల విలువ ఎన్నటికీ తరగదని, విద్యార్థులకు భాషా నైపుణ్యాలను పెంపొందించడం అవసరమని అభిప్రాయపడ్డారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మిరామానంద్‌ మాట్లాడుతూ భారతదేశ సాంస్కృతిక సంప్రదాయాలు గొప్ప విలువలను కలిగి ఉన్నాయని తెలిపారు. అనంతరం విద్యార్థులకు భాషా ఔన్నత్యంపై వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. డీఈఓ బి.రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్‌తేజ్‌, జిల్లా విద్యాశాఖ కమిటీ మొలిలైజర్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌, ఎంఈఓ కొర్ర సారయ్య, ఎస్‌ఓ నాగేశ్వరరావు, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి ఎస్‌.సారంగపాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement