హన్మకొండ చౌరస్తా: వరంగల్ ట్రైసిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి, మానవాళి మనుగడ కోసం శనివారం నిర్వహించిన రన్ ఫర్ జీసస్’ ర్యాలీలో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్ద ప్రారంభమైన ర్యాలీకి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. రన్ నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ట్రైసిటీ నుంచి క్రైస్తవులు రన్‌లో ప్లకార్డులు చేతబూని అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ అప్పయ్య
వేలేరు: రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ రాకుండా వ్యాధుల నివారణ కోసం 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఆయన వ్యాక్సిన్లు వేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. గొల్లకిష్టంపల్లి సర్పంచ్ శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైధ్యాధికారి డాక్టర్ నవీన్‌కుమార్, కేజీబీవీ ఎస్‌ఓ స్రవంతి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


