న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కృత్రిమ మేధతో వేగంగా సేవలు
కృత్రిమ మేధ వినియోగంతో విద్యుత్ రంగంలో సేవలు వేగంగా అందుతున్నాయని
ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు.
గీసుకొండ: గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)కు భూములిచ్చిన రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న రాజీవ్ టౌన్‌షిప్‌నకు మహర్దశ పట్టనుంది. కేఎంటీపీ కోసం సుమారు 1300 ఎకరాల భూమిని సేకరించారు. ఒక్కో ఎకరానికి వంద గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఊకల్–స్టేషన్ చింతలపల్లి మార్గం ఇరువైపులా పైలాన్ సమీపంలో 54.11 ఎకరాలు కేటాయించింది. 2024 డిసెంబర్ 7న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్కు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డ్రా పద్ధతిన రైతులకు ప్లాట్లను కేటాయించారు. 50 నుంచి 60 గజాల స్థలాలు వచ్చిన రైతులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీలుపడకపోవడంతో ఈ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తక్కువ స్థలాలు వచ్చిన 183 మందికి 75 గజాల చొప్పున కేటాయించారు. సీఎం రేవంత్‌రెడ్డి 2024లో కేఎంటీపీని సందర్శించి భూములు ఇచ్చిన రైతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు 2024 నవంబర్‌లో టౌన్‌షిప్‌కు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్దప్రసాద్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే, ఇంటి స్థలాలకు కేటాయించిన ప్రాంతాన్ని రాజీవ్ టౌన్‌షిప్‌గా పేర్కొంటూ మౌలిక సదుపాయాల కోసం సీఎం రూ.43.33 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో టౌన్‌షిప్ వద్ద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, వెటర్నరీ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పలు నిర్మాణ పనులు చేపడుతున్నారు. విద్యుత్ స్తంభాలు, తీగలు, ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 2 లక్షల లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిని వాటర్‌ట్యాంకు, అండర్‌గ్రౌండ్ సంపు, పంపురూంల పనులు చేపట్టారు.
115 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి
రాజీవ్ టౌన్‌షిప్‌లో 866 ప్లాట్లకు ప్రస్తుతానికి 155 ప్లాట్ల లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్ తెలిపారు. మిగిలిన వారంతా త్వరగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అవసరమైన పత్రాలను తహసీల్దార్‌కు అందించాలని ఇటీవల కొనాయమాకుల వద్ద జరిగిన రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు. వర్షాకాలం లోపు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మోడల్ ఇళ్ల నమూనాలపై ప్రచారం
టౌన్‌షిప్‌లోని తమ ప్లాట్లలో సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని వారికి తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణాలు చేపడుతామని ఓ సంస్థ వారు ముందుకొచ్చారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఇటీవల రైతులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ద్వారా వివరించారు.


