వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వద్దు

Apr 5 2026 7:24 AM | Updated on Apr 5 2026 7:24 AM

కాశిబుగ్గ: రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం వద్దని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిని శనివారం ఆమె తనిఖీ చేశారు. వివిధ విభాగాలను స్వయంగా సందర్శించారు. ఓపీ విభాగాల్లో వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. పలు వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్‌ను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడారు. రోగుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం అన్ని విభాగాల వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆస్పత్రిలో పరిశుభ్రత, ఔషధాల లభ్యత, సిబ్బంది సమయపాలన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. రోగులకు అన్ని వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని, సౌకర్యాలు కల్పించడం బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత, ఆర్డీఓ సుమ, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

ఎంజీఎం ఆస్పత్రిలో తనిఖీ

పలు విభాగాల పరిశీలన

వైద్యులు, సిబ్బందితో సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement