● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట: నియోజకవర్గంలో నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామసర్పంచ్‌లు, అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైనా సమస్య ఏర్పడితే అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి కల్పన, ఆర్డీఓ ఉమారాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ సురేందర్, పబ్లిక్ హెల్త్ ఈఈ సుచరణ్, మున్సిపల్ కమిషనర్ భాస్కర్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


