మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తం | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తం

Mar 21 2026 5:58 AM | Updated on Mar 21 2026 5:58 AM

హన్మకొండ: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆశలకు నెలకు రూ.18,000 వేతనం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్‌, తెలంగాణ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాసు మాదవి డిమాండ్‌ చేశారు. ఈమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశలు శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించారు. రాంనగర్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి మంత్రి ఇంటికి ఆశలు ర్యాలీగా బయల్దేరారు. మంత్రి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు నెట్టేసి పోలీసులను తోపుకుంటూ ముందుకు వెళ్లేందుకు సీఐటీయూ నాయకులు, ఆశలు తీశ్రంగా శ్రమించారు. పోలీసులు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అనంతరం మంత్రి ఇంటి సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు మంత్రి పీఏతో ఫోన్‌లో మాట్లాడించి.. శనివారం మంత్రి సురేఖను కలిసేలా ఏర్పాటు చేస్తామని వినతి పత్రం అందించి సమస్యలు వివరించుకోవచ్చని సీఐ రంజిత్‌ కుమార్‌ చెప్పడంతో శాంతించి ధర్నా విరమించారు. ఆశలను నాలుగో తరగతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 28న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్‌ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్‌ కార్యక్రమంలో ఆశ యూనియన్‌, సీఐటీయూ నాయకులు సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగాం శ్వేత, సీహెచ్‌ శ్రీవాణి, పద్మ, సీహెచ్‌ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ, కరుణలత, లీల, పుష్ప, ప్రేమలతతోపాటు వందలాది మంది ఆశలు పాల్గొన్నారు.

ఆశ వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట

రోడ్డుపై బైఠాయించి ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement