హామీల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Mar 21 2026 5:58 AM | Updated on Mar 21 2026 5:58 AM

విద్యుత్‌ బస్సులు ఆర్టీసీకే కేటాయించాలి

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ

హన్మకొండ: ఎన్నికల హామీలు నెరవేర్చడంలో రాష్ట్రంలోని రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, రాష్ట్ర నాయకురాలు రావు పద్మ ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌పీ.జయంత్‌లాల్‌, సండ్ర మధు, డాక్టర్‌ కాళీప్రసాద్‌, డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌ రెడ్డి, చాడా శ్రీనివాస్‌ రెడ్డి, రావుల కిషన్‌, దొంతి దేవేందర్‌ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ రావు, నానునాయక్‌, చాడా స్వాతి, దాస్యం అభినవ్‌ భాస్కర్‌, గుజ్జుల వసంత, బైరి లక్ష్మి, కోమల, మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

హన్మకొండ: విద్యుత్‌ బస్సులు ఆర్టీసీకే కేటాయించేలా చూడాలని ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ వరంగల్‌ రీజియన్‌ కార్యదర్శి ఉపేంద్రచారి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వరంగల్‌ –1, వరంగల్‌ –2 డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ బస్సులను ప్రైవేట్‌ వాళ్లకు అప్పగిస్తూ ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్‌ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని, ఆర్టీసీ యూనియన్లపై ఆక్షలు ఎత్తివేయాలని, 2021, 2025 వేతన సవరణ అమలు చేయాలని, 2017 అలవెన్సులు చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎస్‌ వరంగల్‌ –2 డిపో కార్యదర్శి వై.శ్రీనివాస్‌, కరీంనగర్‌ జోన్‌ కోశాధికారి ఎండీ ఆర్కేపాషా, ఉద్యోగి సంపత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement