రోజూ రూ.50 లక్షల పన్నులు వసూలు చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: పన్ను బకాయిల వసూళ్లకు గడువు దగ్గర పడిందని, బకాయిలు రోజూ రూ.50 లక్షలు వసూలు చేయాల్సిందేనని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పన్నులు సేకరించాలన్నారు. సెల్‌టవర్ల బకాయిలు రూ.6.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని సంబంధిత ఏజెన్సీల నుంచి వసూలు చేయాలన్నారు. టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు ‘బిల్డ్ నౌ’ లో చైన్ మెన్‌లతో పాటు నూతనంగా బాధ్యతలు చేపట్టిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, సీహెచ్‌ఓ రమేశ్, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, సమ్మయ్య, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


