ప్రతిభను వెలికితీసేందుకు దోహదం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభను వెలికితీసేందుకు దోహదం

Feb 3 2026 7:07 AM | Updated on Feb 3 2026 7:07 AM

ప్రతిభను వెలికితీసేందుకు దోహదం

ప్రతిభను వెలికితీసేందుకు దోహదం

ప్రతిభను వెలికితీసేందుకు దోహదం

విద్యారణ్యపురి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనడం ద్వారా ప్రతిభను వెలికితీయవచ్చని హనుమకొండ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌ అన్నారు. గాంధీ గ్లోబల్‌ ఫౌండేషన్‌ సహకారంతో హనుమకొండ జిల్లా సోషల్‌ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం జిల్లాలోని టెన్త్‌ విద్యార్థులకు సోషల్‌ స్టడీస్‌ టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జాతీయ స్థాయి కళాఉత్సవంలో బహుమతి పొందిన మైత్రి తేజల్‌ ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్యం ఆకట్టుకుంది. పలువురు రాష్ట్రస్థాయి టాలెంట్‌ టెస్టుకు ఎంపికయ్యారు. విజేతలకు పెరుక జిల్లా కో–ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు నల్లపు కోటేశ్వర్‌ నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సోషల్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు అలిగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, సీనియర్‌ ఉపాధ్యాయుడు రాధాకృష్ణచారి, నిట్‌ ప్రొఫెసర్‌ కోలా ఆనందకిషోర్‌, స్ప్రింగ్‌ స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌ బి.రాధ, జీహెచ్‌ఎం రవీందర్‌, సమగ్ర శిక్ష ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ బి.మహేశ్‌, జిల్లా డీసీఈబీ సెక్రటరీ డాక్టర్‌ బి.రాంధన్‌, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్‌, హసన్‌పర్తి ఎంఈఓ ఎ.శ్రీనివాస్‌ సోషల్‌ ఫోరం బాధ్యులు పాల్గొన్నారు.

డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌

జిల్లా స్థాయి సోషల్‌ స్టడీస్‌ టాలెంట్‌ టెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement