6 వసంతాల పరకాల | - | Sakshi
Sakshi News home page

6 వసంతాల పరకాల

Feb 3 2026 7:07 AM | Updated on Feb 3 2026 7:07 AM

6 వసంతాల పరకాల

6 వసంతాల పరకాల

6 వసంతాల పరకాల – 8లోu

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

పరకాల: జిల్లాలో పరకాల ఏకైక మున్సిపాలిటీ. 2018లో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పరకాలను నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌ గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం రెండోసారి మున్సిపల్‌ పోరుకు సిద్ధమైంది. పరకాల ప్రాంతం కాకతీయుల పాలన నుంచే నివాసాలకు కేంద్రంగా ఉండేది. బ్రిటిష్‌ పాలనలోనే పరకాల ఒక తాలుకా కేంద్రంగా గుర్తింపు పొందింది. 1960లోనే అప్పటి జనాభా ప్రకారం.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే పరకాలను కొంతకాలం మున్సిపాలిటీగా కూడా పరిగణించారు.

గ్రామ పంచాయతీగా..

పరిపాలనా మార్పుల ప్రభావంతో 1965లో పరకాల మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాల్సి వచ్చింది. 1965 నుంచి గ్రామ పంచాయతీగా ఉన్న పరకాల 2014లో నగర పంచాయతీగా మారింది. 2018లో తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పంచాయతీలను పట్టణ స్థాయికి మార్చే నిర్ణయంలో భాగంగా 20 వార్డులు ఉన్న పరకాల నగర పంచాయతీని పట్టణ శివారులోని రాజీ పేట, సీతారాంపూర్‌ రెండు గ్రామాలను విలీనం చేస్తూ.. 22 వార్డులతో నగర మున్సిపాలిటీగా గుర్తించింది.

పెరిగిన పోటీ..

పట్టణంలో 10,500 కుటుంబాలుండగా.. జనాభా సుమారు 38 వేలు. ఈ మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డుల్లో 26,812 మంది ఓటర్లు ఉండగా.. 13,864 మంది మ హిళా ఓటర్లు, 12,948 మంది పురుషుల ఓటర్లు ఉ న్నారు. 2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్ని కలో ఎస్సీ రి జర్వేషన్‌ కాగా, రెండోసారి 2026లో జరుగుతున్న ఎన్నికలో మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని జనరల్‌కు కేటాయించడంతో ఎన్నికల్లో పోటీ పెరిగిపోయింది. ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీలో జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు పోటీపడుతున్నాయి. దీంతో అన్ని వార్డుల్లో త్రిముఖ పోటీనెలకొంది.

1960లో పురపాలక సంస్థ

పరిపాలనా మార్పులతో

1965లో మేజర్‌ జీపీగా అవతరణ

2018లో మున్సిపాలిటీగా గుర్తింపు

రెండోసారి మున్సిపల్‌ పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement