
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఆంధరప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అక్కడి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి నెట్‌వర్క్
కక్షసాధింపు చర్యలు మానుకోవాలి
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సమాజానికి మేలు జరగదు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సుపరిపాలన అనిపించుకోదు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు.
– ఎం.వివేక్, డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు
కేసుల నమోదు సరికాదు
ములుగు రూరల్: సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేసే పత్రికలపై దాడులు, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – పోలురాజు,
టీఎన్జీఓ ములుగు జిల్లా అధ్యక్షుడు
దాడులు ఖండిస్తున్నాం..
జనగామ: ప్రభుత్వం చేసే మంచి, చెడులను ప్రజలకు తెలియజేస్తూ, మనకు దారి చూపించే పత్రికలపై ఏపీ సర్కారు తీరు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సమాజంలో పత్రికలే మార్గదర్శంగా ఉండి మనల్ని నడిపిస్తున్నాయి.
–పెండెల శ్రీనివాస్, గ్రామ పరిపాలన ఆఫీసర్,
రాష్ట్ర నాయకుడు, జనగామ
ఏపీ ప్రభుత్వానికి ఇది మంచిదికాదు
సాక్షి దినపత్రిక, ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు

పత్రికా స్వేచ్ఛను హరించొద్దు