
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు కేజీబీవీ విద్యార్థినుల
నల్లబెల్లి: రాష్ట్రస్థాయి అండర్–19 రెజ్లింగ్ పోటీలకు నల్లబెల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థినులు ఎంపికై నట్లు ఎస్‌ఓ సునీత తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను పీఈటీ సుజాత, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థినులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 17న హన్మకొండ జేఎన్‌ఎస్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న అజ్మీరా మానస, పెంట అర్చన ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరు ఈ నెల 21 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో జరుగనున్న పోటీల్లో పాల్గొంటారు.
వాలీబాల్ పోటీల్లో సిల్వర్ మెడల్
రాయపర్తి: రాష్ట్రస్థాయి అండర్–17 వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు ద్వితీయస్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించినట్లు కోచ్ పుట్ట సమ్మయ్య తెలిపారు. పటాన్‌చెరులో నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్ క్రీడల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఫైనల్‌లో ఖమ్మం జట్టుతో పోరాడి ద్వితీయస్థానంలో నిలిచినట్లు చెప్పారు.

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు కేజీబీవీ విద్యార్థినుల