
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ సత్యశారద
● నర్సంపేట బీసీ బాలుర వసతి గృహం ఆకస్మిక తనిఖీ
నర్సంపేట: వసతి గృహాల్లో మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని బీసీ బాలు ర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వి ద్యార్థులు, సిబ్బంది వివరాలు, రిజిస్టర్లు, వంట గది, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ మెనూ ప్రకారం రుచి కర మైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులు హాస్టల్‌కు వచ్చివెళ్లే టప్పుడు కేర్‌టేకర్ వెంట ఉండాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం బీసీ హాస్టల్స్ విద్యార్థులు మెరుగైన ఫలితా లు సాధించేందుకు కృషిచేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులను సబ్జెక్టు వారీగా ప్రశ్నలు అడిగా రు. హాస్టల్ పరిసరాలు, ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. జిల్లా వెనుకబడిన సంక్షేమ అధికారి పుష్పలత, వసతి గృహ సంక్షేమ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.