
యువతలో మానసిక స్థైర్యం కల్పించాలి
నర్సంపేట: యువతలో మానసిక స్థైర్యం కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యు అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్ సౌజన్యంతో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మారుతున్న అలవాట్లకు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమన్నారు. మహిళా సాధికారిక విభాగం అధ్యక్షురాలు ఎస్.రజిత మా ట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. గెలుపొందిన వారికి త్వరలో బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారిక విభాగం సభ్యులు డాక్టర్ సంధ్య, మాధవి, అకాడమీ కో ఆర్డినేటర్ డాక్టర్ కందాల సత్యనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్.కమలాకర్, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా బాధ్యులు డాక్టర్ ఎం.రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.