
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్‌లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. ని జాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ ము న్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్‌రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో వారు హైకోర్టును ఆశ్రయి ంచారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్‌రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకు న్నారు. పులివేషధారణ, కత్తిసాము, విన్యాసాలు, పిట్టల దొర, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు (గురువారం) వినూత్నంగా నిర్వహించనున్న
దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
మైసంపల్లిలో హోమం
నిర్వహిస్తున్న ప్రజలు (ఫైల్)
ప్రత్యేకంగా వేడుకలు
జరుపుకునేందుకు ఏర్పాట్లు
మద్యం, మాంసాహారానికి పలువురు దూరం
ఉమ్మడి జిల్లాలో నేడు దసరా ఉత్సవాలు

వినూత్నం.. విజయదశమి