
అంచనాలు తారుమారు
సాక్షిప్రతినిధి, వరంగల్:
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నిరాశ పర్చాయి. ప్రధానంగా ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. శనివారం ప్రకటించిన ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు వారిని పునరాలోచనలో పడేశాయి. అవకాశం ఉంటే ఇప్పటికై నా మార్పులు చేర్పులు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణ చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో రిజర్వేషన్లు..
2019లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు భిన్నంగా ఉంటాయని ఆశించిన ద్వితీయశ్రేణి నాయకులకు శరాఘాతంలా మారాయి ఈ రిజర్వేషన్లు. అప్పుడు వరంగల్ అర్బన్ (హనుమకొండ)లో ఏడు మండలాలు ఉండగా.. మహిళలకు నాలుగు, జనరల్‌కు మూడు ఎంపీపీ స్థానాలను కేటాయించారు. వీటిలో ఎస్సీలకు రెండింటిలో ఒకటి మహిళ, ఒకటి జనరల్ (మహిళలు, పురుషులు)కు ఇచ్చారు. బీసీలకు రెండింటిలో ఒకటి మహిళకు, మరోటి జనరల్‌కు, అన్ రిజర్వుడ్ కోటాలోని మూడింటిలో రెండు మహిళలు, ఒకటి జనరల్‌కు రిజర్వు చేశారు.
అదేవిధంగా వరంగల్ రూరల్‌గా వరంగల్ జిల్లాలో 16 మండలాలు ఉంటే.. మహిహిళలకు 7, జనరల్‌కు 9 కేటాయించారు. మూడు ఎస్టీల్లో ఒకటి మహిళకు, రెండు జనరల్ (మహిళలు/పురుషులు)లకు, ఎస్సీలకు కేటాయించిన మూడింటిలో ఒకటి మహిళకు, రెండు జనరల్‌కు రిజర్వ్ చేశారు. బీసీలకు రిజర్వ్ చేసిన రెండింటిలో ఒకటి మహిళకు, ఒకటి జనరల్‌కు, అన్‌రిజర్వుడ్ కేటగిరి కింద కేటాయించిన 8 ఎంపీపీలకు నాలుగు మహిళలకు, 4 జనరల్‌కు రిజర్వ్ చేశారు. అలాగే, జెడ్పీటీసీ రిజర్వేషన్లకు వచ్చేసరికి వరంగల్ రూరల్‌లో 16 స్థానాలకు 8 మహిళలు, 8 జనరల్‌కు కేటాయించారు. వరంగల్ అర్బన్‌లో 4 మహిళలు, మూడు జనరల్‌కు ఇచ్చారు.
తాజా రిజర్వేషన్లు ఇలా..
2021 ఆగస్టులో వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండగా, వరంగల్ రూరల్ జిల్లా వరంగల్‌గా మారిన తర్వాత మండలాలు అటు ఇటుగా మారాయి. హనుమకొండలో 15 మండలాలు కాగా, వరంగల్‌లో 13 మండలాలు మిగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న హనుమకొండ జిల్లాలోని మండలాల నుంచి ఎంపీపీలు, జెడ్పీటీసీలు కావాలనుకున్న వారికి గత రిజర్వేషన్లకు భిన్నంగా రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎల్కతుర్తి మండలం గత ఎన్నికల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ ఎస్సీలకే రిజర్వ్ చేశారు. ఈసారి కచ్చితంగా బీసీలకు చాన్స్ ఉంటుందని అక్కడి నేతలు భావించారు. కానీ, అందుకు భిన్నంగా మళ్లీ ఎస్సీలకే రిజర్వు అయ్యాయి. జెడ్పీటీసీ రిజర్వేషన్లలో ఆత్మకూరు బీసీకి, పరకాల అన్ రిజర్వుడ్, శాయంపేట, దామెర బీసీలకు, ధర్మసాగర్, వేలేరు అన్‌రిజర్వుడ్ (మ), నడికూడ అన్‌రిజర్వుడ్, హసన్‌పర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి బీసీ మహిళలకు రిజర్వు చేశారు. మిగిలిన మండలాల్లోనూ ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఆశించిన మేర రాలేదన్న నిరాశ అన్ని పార్టీల కేడర్ల నుంచి వినిపిస్తోంది.
హనుమకొండ జిల్లాలో రిజర్వేషన్లు ఇలా..
మండలం జెడ్పీటీసీ ఎంపీపీ
ఆత్మకూరు బీసీ జనరల్ బీసీ జనరల్
భీమదేవరపల్లి బీసీ మహిళ బీసీ మహిళ
దామెర బీసీ జనరల్ బీసీ మహిళ
ధర్మసాగర్ మహిళ జనరల్ మహిళ జనరల్
ఎల్కతుర్తి ఎస్సీ జనరల్ ఎస్సీ మహిళ
హసన్‌పర్తి ఎస్సీ మహిళ ఎస్సీ జనరల్
ఐనవోలు ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్
కమలాపూర్ బీసీ మహిళ బీసీ మహిళ
నడికూడ జనరల్ జనరల్
పరకాల జనరల్ జనరల్
శాయంపేట బీసీ జనరల్ బీసీ జనరల్
వేలేరు జనరల్ మహిళ జనరల్ మహిళ
వరంగల్ జిల్లాలో ఇలా..
చెన్నారావుపేట జనరల్ మహిళ జనరల్ మహిళ
దుగ్గొండి జనరల్ జనరల్
ఖానాపురం ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళ
నల్లబెల్లి బీసీ జనరల్ బీసీ జనరల్
నర్సంపేట ఎస్టీ మహిళ ఎస్టీ జనరల్
నెక్కొండ బీసీ జనరల్ బీసీ మహిళ
వర్ధన్నపేట ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ
పర్వతగిరి బీసీ జనరల్ బీసీ జనరల్
రాయపర్తి బీసీ మహిళ బీసీ మహిళ
సంగెం బీసీ మహిళ బీసీ జనరల్
గీసుకొండ ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్
నిరాశకు గురిచేసిన స్థానిక
సంస్థల రిజర్వేషన్లు
ఎంపీపీ, జెడ్పీటీసీగా పోటీ చేసే వారి ఆశలు గల్లంతు
మార్పులు చేయాలని నేతల
చుట్టూ ప్రదక్షిణలు