
సమన్వయంతో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లు
హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్
హన్మకొండ అర్బన్ : బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను జిల్లా అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, వేద పండితులతో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. ఈనెల 21న వేయిస్తంభాల ఆలయం వద్ద ఘనంగా బతుకమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా పోలీసులను బందోబస్తుకు కేటాయించాలన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తామన్నారు.