
కడియం శ్రీహరికి డిపాజిట్ రాదు
వేలేరు: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరికి డిపాజిట్ కూడా రాకుండా ప్రజలు ఓడిస్తారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని బండతండా, చింతలతండా, కమ్మరిపేట, లోక్యాతండా, సోడాషపల్లి, మల్లికుదుర్లలో ఊరూరికీ బీఆర్‌ఎస్ సంక్షేమాలు, ఇంటింటికీ కేసీఆర్ పథకాలు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని విమర్శించారు. కడియం శ్రీహరి వెంట అవకాశవాద కార్యకర్తలే ఉన్నారని, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిర వెంట ఉన్నారన్నారు. కడియం శ్రీహరికి నియోజకవర్గంలోని సాగునీరు, యూరియా సమస్యలు కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేవరకు పోరాటం చేస్తానన్నారు. కడియం శ్రీహరి తోత్తులు నా శవయాత్ర చేసినా, ఎం చేసినా నియోజకవర్గ ప్రజల తరఫున పోరాటం చేస్తానన్నారు. నాయకులు కీర్తి వెంకటేశ్వర్లు, భూపతిరాజు, సంపత్, గోవింద సురేశ్, మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్ నాయక్ తదితరులు ఉన్నారు.
దేవాదులకు కాంగ్రెస్ రూపాయి ఇవ్వలేదు
ప్రాజెక్టు పూర్తి కోసం పోరాటం చేస్తాం..
మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య