
కొలువుదీరిన జీపీఓలు
● జిల్లాలో 174 క్లస్టర్లు, 191 మంది ఎంపిక
● ఇకపై గ్రామాల్లో మెరుగైన సేవలు
నర్సంపేట: గ్రామపంచాయతీల్లో గతంలో మాది రిగా మెరుగైన సేవలు అందించేందుకు జీపీఓల నియామకం పూర్తయింది. జిల్లాలోని 14 మండలా ల్లో 174 క్లస్టర్లలో 191 మంది జీపీఓ (గ్రామ పాలన అధికారి)లను అటాచ్ చేశారు. పూర్వ వీఆర్‌ఓ, వీఆ ర్‌ఏలను తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష యం విదితమే. ఈ మేరకు ఆసక్తి ఉన్న గత వీఆర్‌ఓ లు, వీఆర్‌ఏలకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించి జీపీఓలను కేటాయించారు. ఇక మీదట గ్రామాల్లో మెరుగైన రెవెన్యూ సేవలు అందనున్నాయి.
జిల్లాలో 14 మండలాలు..
జిల్లాలో 14 మండలాలు, 174 క్లస్టర్లు ఉన్నాయి. 19 1 మంది జీపీఓలను ఎంపిక చేసి నియామక పత్రాలు అందించారు. ఈ మేరకు ఈనెల 5న హైదరాబా ద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పత్రాలు అందజేశారు. ఎంపికై న జీపీఓలకు క్లస్టర్‌లను కేటా యిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో జీపీఓలు కొలువుదీరుతున్నారు.
తీరనున్న సమస్యలు
గ్రామాల్లో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థలను రద్దు చేసి న నాటి నుంచి సమస్యలు పేరుకుపోయాయి. వి ద్యార్థులకు కులం, ఆదాయంతో పాటు ఇతర సర్టిఫి కెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు సమస్యలు తప్పలేదు. ప్రతీ చిన్న పనికి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. సకాలంలో పనులు కాకపోవడంతో పడరాని పాట్లు పడ్డారు. ప్రస్తుతం జీపీఓల కేటాయింపుతో సమస్యలు తీరనున్నాయి
భూ భారతి చట్టంలో వేగం..
గత ప్రభుత్వంలో పేరుకుపోయిన భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చింది. ధరణిని రద్దు చేస్తూ ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు భూ సమస్యలపై గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం సాదాబైనామాలో దరఖాస్తు చేసుకున్న భూ సమస్యలను పరిష్కారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జీపీఓలు ప్రధాన భూమి పోషించనున్నారు. సర్వేయర్లతో పాటు రెవెన్యూ అధికారులకు వీరు సహకరిస్తారు.
రెండు విడతల్లో పరీక్షలు..
జీపీఓ పోస్టుకు గతంలో వీఆర్‌ఓగా పని చేసిన వారికి అవకాశం కల్పించింది. వీఆర్‌ఓలు డిగ్రీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించి 191 మందిని జీపీఓలుగా ఎంపిక చేశారు.