
సామాజిక చైతన్యం కలిగి ఉండాలి
● ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి
నర్సంపేట: విద్యార్థులు సామాజిక చైతన్యం కలిగి ఉండాలని నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ చల్ల పల్లి స్వరూపారాణి అన్నారు. ఆదివారం పట్టణంలోని విజ్‌డమ్ పాఠశాలలో లీడ్ లైబ్రరీ, పాకాల కవులు సంయుక్తంగా నిర్వహించిన అల్లిక పుస్తక పరిచయ సభ ప్రముఖ కవి కాసుల రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ సాహిత్యం ప్రజలకు వైపు ఉండాలని, విద్యార్థులు చిన్నతనం నుంచే సామాజిక చైతన్యం కలిగి ఉండాలన్నారు. చైతన్యవంతమైన సమాజాన్ని రూపుదిద్దడంలో ప్రతి వ్యక్తి తనవంతు భాగస్వామ్యం కలిగి ఉండాలన్నారు. పుస్తక పరిచయ సభను నర్సంపేటలో నిర్వహించినందుకు లీడ్ లైబ్రరీ, పాకాల కవులకు ధన్యవాదాలు తెలిపారు. విజ్‌డమ్ హైస్కూల్ డైరెక్టర్ సయ్యద్ జావేద్ మాట్లాడుతూ సమాజంలో కవుల పాత్ర ప్రశ్నించే తత్వాన్ని తెలియజేశారు. తంగిరాల సోని మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, వివిధ సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కవులు బండారి రాజ్‌కుమార్, డాక్టర్ తండా హరీష్‌గౌడ్, కుంజ కల్యాణి, పుచ్చ కుమారస్వామి, శిల్ప జగదీష్, ప్రేమ్‌కుమార్, ఉపాధ్యాయులు నరసింహ, రాములు, సుభాని, రాపాక శ్రీనివాస్, విద్యార్థులు, సాహితీ మిత్రులు పాల్గొన్నారు.