
స్విమ్మింగ్ పోటీల్లో కాట్రపల్లి విద్యార్థుల ప్రతిభ
రాయపర్తి: రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో కాట్రపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీలక్ష్మి శనివారం తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈనెల 12న వరంగల్ జిల్లా కేంద్రంలో బిర్లా ఓపెన్‌మైండ్స్ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ట్రాయల్‌థన్ పోటీల్లో పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎల్.చరణ్, తొమ్మిదో తరగతి విద్యార్థి ఎండీ అబ్దుల్‌థాహెర్ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ అంబర్‌పేటలోని అంతర్జాతీయ స్విమ్మింగ్‌పూల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పీడీ సమ్మయ్య, విద్యార్థులు చరణ్, ఎండీ అబుల్‌థాహెర్‌ను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించినట్లు ఆమె తెలిపారు.