ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం

Sep 14 2025 2:16 AM | Updated on Sep 14 2025 2:16 AM

ఫోర్ట

ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం

ఖిలా వరంగల్‌: రేషన్‌ బియ్యాన్ని నల్ల బజారులో విక్రయిస్తున్నారా.. అయితే డబ్బు ఖర్చు చేయకుండా వచ్చిన పోషకాలను కోల్పోయినట్లే. కిలోకు రూ.10 లేదా రూ.15 కోసం ఆ బియ్యాన్ని విక్రయిస్తే.. తర్వాత ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. అవగాహన లేక కొందరు లబ్ధిదారులు ఫోర్టిఫైడ్‌ రేషన్‌ సన్న బియ్యాన్ని నల్లబజారులో విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. పౌరసరఫరాల శాఖ రెండేళ్లుగా ఫోర్టిఫైడ్‌ రైస్‌ను జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి జిల్లాలోని 509 షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది. జిల్లాలో పాతకార్డులు 2,66,429 కాగా.. నూతనంగా జారీచేసిన 16,251 కార్డులతో 282,680 కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులకు 53,82,518 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే ఇందులో ప్రతి నెలా 5 నుంచి 10 శాతం రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులు ఫోర్టిఫైడ్‌ రైస్‌పై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అపోహలు వద్దు..

చిన్నారులు, యువకులు, గర్భిణుల్లో 35 నుంచి 50 శాతం రక్తహీనత ఉన్నట్లు జాతీయ కుటుంబ సర్వే నివేదిక పేర్కొంది. ఎలాంటి అపోహలు లేకుండా ఫోర్టిఫైడ్‌ రైస్‌ను ఆహారంగా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్‌ వరుసగా 13 మిల్లీగ్రాముల నుంచి 15.19 మిల్లీగ్రాములు ఉన్నట్లు నివేదిక తేల్చింది.

పోషకాలు ఎంత మేర కలుపుతారంటే..

ఒక బ్యాగుకు 28 నుంచి 42.5 మిల్లీగ్రాముల వరకు ఐరన్‌ (ఫెర్రిక్‌ ఫైరోపాస్ఫేట్‌) కలుపుతారు. దీనికి బదులు సోడియం ఐరన్‌ 14 నుంచి 25.25 మిల్లీగ్రాములు కలుపుతారు. ఒక బ్యాగుకు 75 నుంచి 125 మిల్లీగ్రాముల వరకు ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ–12 కోసం హైడ్రాకై ్స కో బలమైన పోషకాలు, జింక్‌ , విటమిన్‌ ఏ, థయమిన్‌, రైబోప్లావిన్‌, నియాసిన్‌, విటమిన్‌ బీ6, పోషకాలు కలుపుతారు. ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్త హీనత సమస్య ఉండదు. చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకోసమే బియ్యాన్ని హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకాల్లో వినియోగిస్తున్నారు.

బియ్యాన్ని వినియోగించాలి

రేషన్‌ దుకాణాల్లో పంపిణీ జరుగుతున్న ఫోర్టిఫైడ్‌ కెర్నెల్స్‌ బియ్యాన్ని లబ్ధిదారులు ఆహారంగా తీసుకోవాలి. దుకాణాల్లో తీసుకున్న బియ్యాన్ని ఇతరులకు విక్రయించకుండా ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు. రక్తహీనతను అధిగమించవచ్చు. చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రేషన్‌ బియ్యాన్ని వినియోగించాలి.

– డాక్టర్‌ నరేశ్‌కుమార్‌,

వైద్యమండలి ఉమ్మడి జిల్లా సభ్యుడు

ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం1
1/4

ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం

ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం2
2/4

ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం

ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం3
3/4

ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం

ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం4
4/4

ఫోర్టిఫైడ్‌తో ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement