
ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన ఉండాలి
సైబర్ క్రైం ఏసీపీ గిరి కుమార్
హన్మకొండ: సైబర్ నేరాలు, ఆన్‌లైన్ లైంగిక వేధింపులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం ఏసీపీ గిరికుమార్, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ జె.శ్యాంసుందర్ అన్నారు. గురువారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో వనం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిస్టర్ నిర్మల ఆధ్యక్షతన సైబర్ క్రైం, మానవ అక్రమ రవాణా అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో వారు మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉంటే వాటి బారిన పడకుండా ఉంటారన్నారు. మహిళలను, పిల్లలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీస్ 100, 1930 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బత్తుల కరుణ, వనం మహిళా సంఘం రీజియన్ ప్రెసిడెంట్ రుమాల్డిన, ట్రెజరర్ రిజి అబ్రహం, కౌన్సిలర్ అన్నమేరి, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ ఎర్ర శ్రీకాంత్, వనం మహిళా సంఘం అధ్యక్షురాలు మేరీ పాల్గొన్నారు.