
బారులుదీరారు.. వెనుదిరిగారు..
ఖానాపురం: రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. రోజంతా క్యూలో నిలబడ్డా ఒక్క బస్తా దొరకని పరిస్థితులను చూశాం.. అయితే రాత్రంతా వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది మండలంలోని బుధరావుపేటలో.. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బుధరావుపేట గ్రామానికి యూరియా వస్తుందని గ్రామంలోని రైతులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి 1.30 గంటలకు రైతులు గ్రామ పంచాయతీ వద్దకు పరుగులు పెట్టారు.. ఆ నోటా.. ఈ నోటా.. ఈ విషయం రైతులందరికీ చేరడంతో భారీగా తరలివచ్చారు. ఆధార్, పంట ఆరోగ్య కార్డులను సీరియల్ ప్రకారం పెట్టి.. గ్రామపంచాయతీ వద్ద వేచిఉన్నారు. కానీ తెల్లవా రుజాము 2 అయినా అక్కడకు అధికారులు రాలే దు.. బస్తాలు పంపిణీ చేయలేదు. సమాధానం చెప్పేవారు కూడా లేకపోవడంతో ప్రభుత్వాన్ని నిందిస్తూ రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు.
తెల్లవారుజాము నుంచే..
గీసుకొండ: మండలంలోని కొనాయమాకుల రైతు వేదిక వద్ద బుధవారం ఉదయం 5 గంటల నుంచే రైతులు యూరియా కోసం బారులుదీరారు. ఊకల్, మనుగొండ, మచ్చాపూర్ గ్రామాలకు కోటా కింద 444 బస్తాల యూరియా రాగా సుమారు వెయ్యి మంది రైతులు వచ్చారు. బస్తాల కోసం వేచి చూసినా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం సరిపడా యూరియాను సరఫరా చేసి ఆదుకోవాలని రైతులు కోరారు. ఏఓ హరిప్రసాద్‌బాబు, ఏఈఓలు టోకెన్లు పంపిణీ చేయగా గొడవలు జరగకుండా ఎస్సైలు కుమార్, రోహిత్ బందోబస్త్ నిర్వహించారు.
యూరియా కోసం రాత్రి రెండుగంటలకు రైతుల క్యూ

బారులుదీరారు.. వెనుదిరిగారు..