
భోజనం రుచికరంగా ఉండాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి
గీసుకొండ: మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్‌ను బుధవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన వంటలను రుచిచూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత, రుచికరంగా ఉండేలా వంటలను తయారు చేయాలని ఆదేశించారు. వంటగది శుభ్రత పాటించాలన్నారు. తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాస్, స్కూల్ ప్రిన్సిపాల్ సునీత తదితరులు పాల్గొన్నారు.