
డిజిటల్ ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలి
● డీఈఓ రంగయ్యనాయుడు
● విద్యార్థులకు ఉపన్యాస పోటీలు
ఖిలా వరంగల్: విద్యార్థులు డిజిటల్ ప్రపంచాన్ని ఉపయోగించుకుని పరిశోధనాత్మక విద్యను అందుకోవాలని వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు సూచించారు. సోమవారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఈఓ రంగయ్యనాయుడు, అడల్ట్ ఎడ్యుకేషన్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్ అధికారి రమేశ్‌రెడ్డి హాజరై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస, నినాదాల పోటీలు ప్రారంభించారు. ఉపన్యాస పోటీల్లో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి ఆకుల సాత్విక ప్రథమ స్థానంలో నిలవగా, పదో తరగతి విద్యార్థి కల్లెపు హరిప్రియ ద్వితీయ స్థానం సాధించింది. విద్యార్థులను డీఈఓ రంగయ్య నాయుడు అభినందించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బత్తుల ప్రసాద్, అధికారులున్నారు.