
ఈజీఎస్‌తో రైతులు లబ్ధి పొందాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
దామెర: ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు లబ్ధి పొంది ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని సీతారాంపూర్‌కు చెందిన రైతు మహమ్మద్ రంజాన్ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల సాయంతో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు. కాగా.. సదరు రైతు మర్యాద పూర్వకంగా గురువారం కలెక్టర్‌ను కలిసి తన చేనులో పండిన డ్రాగన్ ఫ్రూట్లను అందజేశారు. ఈసందర్భంగా పంట సాగులో తీసుకుంటున్న మెళకువలు, మార్కెటింగ్ వంటి వివరాలను రంజాన్ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ ఉపాధిహామీ నిధులతో చేపడుతున్న పండ్ల తోటల సాగు, నాటు కోళ్ల ఫామ్‌ల నిర్వహణ, డైయిరీ ఫామ్‌లతో మండలంలో ఎంతో మంది రైతులు ఆర్థికంగా రాణిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఓ శారద తదితరులు ఉన్నారు.
న్యూశాయంపేట: ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇంజనీరింగ్ బృందం ప్రిలిమినరీ సర్వేలో భాగంగా గురువారం మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను పరిశీలించింది. అనంతరం బృంద సభ్యులు వరంగల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై చర్చించారు. సమావేశంలో ఏఏఐ ఏజీఎంలు నటరాజ్, మనీష్ జోన్వాల్, మేనేజర్లు ఓం ప్రకాశ్, రోషన్ రావత్, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్ ఎస్ ఈలు గౌతంరెడ్డి, రాంప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్ పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు లోకల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం కన్సూమర్స్ గ్రీవెన్స్ రిడ్రసల్ ఫోరం చైర్‌పర్సన్ ఎన్వీ.వేణుగోపాలచారి ఒక ప్రకటనలో తెలిపారు. లోకల్ కోర్టులను ఈనెల 6 నుంచి 19వ తేదీల్లో ఎన్పీడీసీఎల్ పరిధి వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ సర్కిళ్లలోఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టులను వినియోగించుకోవాలని సూచించారు.
లోకల్ కోర్టులు నిర్వహించే ప్రదేశాలివే..
6వ తేదీ: హనుమకొండ సర్కిల్, భీమదేవరపల్లి, నారాయణగిరి, కొత్తకొండ
12న: వరంగల్ సర్కిల్, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ
16న: మహబూబాబాద్ సర్కిల్, డోర్నకల్, కురవి, కొత్తపేట

ఈజీఎస్‌తో రైతులు లబ్ధి పొందాలి