
వరంగల్
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
సాధారణంగా పుట్టిన రోజు వేడుకలు ఏడాదికోసారి జరుపుకుంటుంటాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలు పుట్టిన మరుసటి నెల నుంచే పుట్టిన రోజున సంబురాలు మొదలు పెడుతున్నారు. తొలి ఏడాదిలో నెలకో థీమ్‌తో పిల్లలను వినూత్నంగా అలంకరిస్తున్నారు. కొత్త బట్టలు వేసి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. కేక్ కట్ చేస్తున్నారు. వాట న్నింటినీ 12 నెలలయ్యాక ఒక చోట చేర్చి ఫొటోఫ్రేమ్‌లు కట్టిస్తున్నారు. వీడియోలు మిక్సింగ్ చేస్తున్నారు. ఫస్ట్ బర్త్ డే వేడుకల వేళ వాటన్నింటినీ బంధువుల ముందు ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వచ్చిన లైకులు, కామెంట్లకు దంపతులు మురిసిపోతున్నారు. ఈనేపథ్యంలో నయా బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
వాతావరణం
జిల్లాలో ఉదయం వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వేళ సాధారణంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాద వాతావరణం ఉంటుంది.
ఏడుబావులను చూడగలమా?
మానుకోట జిల్లా బయ్యారం మండలం మిర్యాలపెంట గ్రామ సమీపంలోని ఏడుబావుల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేశారు.
– 8లోu
భూపాలపల్లి అర్బన్: పిల్లల చిన్నప్పటి ఫొటోలు భద్రంగా ఉంచితే పెద్దయ్యాక చూసి మురిసిపోతారు. మా బాబు పుట్టి శనివారంతో నెల రోజులు. అప్పటికప్పుడు ద్రాక్ష పళ్లతో అలంకరించి వేడుకలు జరుపుకున్నాం. ప్రతీ నెల కొత్త బట్టలు వేసి ఒక్కో రకమైన వస్తువులు, సరుకులు, ఇతర పండ్లతో నెలల నంబర్లు వేసి ఫొటోలు దింపుకునేలా ప్లాన్ చేసుకున్నాం. బాబు
పెద్దయ్యాక ఈ ఫొటోలు చూసి మురిసిపోతాడు.
– తోనగర్ శిరీష,
చెల్పూరు, గణపురం
కాజీపేట: బర్త్ డే జరుపుకోవడానికి వన్ ఇయర్ వరకు ఎదురు చూడడం ఎందుకని.. నెల నెలా ఒక్కో థీమ్‌తో మా బాబును రెడీ చేశా. ఫొటోలు తీసి భద్రంగా ఉంచా. పెద్దయ్యాక చూపిస్తే బాబు కూడా సంబురపడతాడు. ఒకప్పుడంటే కెమెరామెన్ వచ్చి ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు ఫోన్‌లోనే ఫొటోలు తీసి ఎడిటింగ్ చేస్తున్నా. మంచి పాటను యాడ్ చేసి సోషల్ మీడియాలో పెడితే చాలా లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. ఆనందంగా ఉంది.
– నిత్యశ్రీ, కాజీపేట
నర్సంపేట: కన్నబిడ్డ ఎదుగుదలను ఫొటోల్లో బంధించడం ఓ మధురానుభూతి. ప్రతి నెల బాబు పుట్టిన రోజును ఓ వేడుకలా నిర్వహించుకుంటున్నాం. ఆపరేషన్ సిందూర్ పేరుతో యుద్ధం జరిగిన రోజే మా బాబు కాసర్ల విహాన్ రామానుజన్‌రెడ్డి ఆరో నెల బర్త్‌డే జరిగింది. దీనికి గుర్తుగా ఇండియా ఫ్లాగ్, గన్ చూపుతూ చేసిన వేడుక మర్చిపోలేం.
– కాసర్ల కావ్య, నర్సంపేట
జనగామ: ఏడాదికి ఒక్కసారి బర్త్ డే నుంచి.. నెలనెలా వేడుకలు జరుపుకునే ట్రెండ్ కొనసాగుతోంది. మాకు ఒక కూతురు. 3 నెలల బాబు ఆదినందన్ ఉన్నారు. పుట్టగానే 21వ రోజు.. 50.. 100వ రోజుతో పాటు నెలనెలా కొత్త బట్టలతో అలంకరించి కేక్ కట్ చేస్తున్నాం. బిడ్డ జీవితంలో ఈ ఘట్టం మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రతీ నెల ఫొటోలను భద్రంగా ఉంచుతూ.. ఏడాది జన్మదిన వేడుకల్లో వీటిని ప్రదర్శిస్తాం.
సాక్షి, మహబూబాబాద్: మా గారాల పట్టి మోజేస్ పాల్ (జాక్) ఈ ఏడాది ఫిబ్రవరి 28న పుట్టారు. ఉమ్మడి కుటుంబం కావడంతో ప్రతీనెల 28వ తేదీ వచ్చిందంటే సాయంత్రం అంతా సందడే.. పిల్లలు, పెద్దలతో ఇంట్లో ప్రతీ పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతీ నెల పిల్ల వాడు పెరిగిన తీరును చూసుకుంటూ.. సంతోష పడతాం.. ఇలా ఇప్పటి వరకు నాలుగు నెలలు గడిచాయి.. ప్రతీ నెల ఫొటోలు తీసి జాగ్రత్తగా ఉంచుతున్నాం. మొదటి పుట్టిన రోజు సమయంలో ప్రతీ
నెల తీసిన ఫొటోలు వరుస క్రమంలో పెట్టి ఫ్లెక్సీ తయారు చేస్తాం..
– దామెర ప్రీతి,
మహబూబాబాద్
పెద్దయ్యాక చూసి మురిసిపోతారు..
న్యూస్‌రీల్
కలకాలం గుర్తుండాలని..
ప్రతిక్షణం ఓ తీపి గుర్తే..
ప్రతీ నెల పండుగే..
– ఉప్పల పద్మ, జనగామ

వరంగల్

వరంగల్

వరంగల్

వరంగల్

వరంగల్

వరంగల్