
మొక్కలు మళ్లీ నాటాలి : డీఆర్డీఓ
నల్లబెల్లి: ఎండిపోయిన మొక్కల స్థానంలో వమొక్కలు మళ్లీ నాటాలని డీఆర్డీఓ కౌసల్యాదేవి ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం 17వ ప్రజావేదిక శనివారం రాత్రి వరకు నిర్వహించారు. మస్టర్‌లోని హాజరులో వ్యత్యాసాలు, కొట్టివేతలు, ఎండిపోయిన మొక్కలు, సమాచార బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు రూ. 4,32,13,475 విలువైన పనులు చేపట్టారు. కూలీలకు రూ.42,54,053, మెటీరియల్‌కు రూ.79,422 ఖర్చు చేశారు. పంచాయతీరాజ్ విభాగంలో రూ. 47,32,554 ఖర్చు చేయగా కూలీలకు రూ.2,400, మెటీరియల్‌కు రూ.47,30,154 వెచ్చించారు. మన ఊరు–మన బడికి సంబంధించి రూ.17, 53,781 ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటికి సంబంధించి ప్రజావేదికను డీఆర్డీఓ కౌసల్యాదేవి నిర్వహించారు.