
యూరియా డెఫ్ విక్రయ కేంద్రం ఆకస్మిక తనిఖీ
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలంలోని వల్భాపూర్‌లోని యూరియా డెఫ్ విక్రయ కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్, సహాయ సంచాలకులు ఆదిరెడ్డి, మండల అధికారి రాజ్‌కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా డెఫ్ తయారీలో సబ్సిడీ యూరియా వాడుతున్నారన్న సమాచారంతో అందులో పనిచేసే గుమాస్తాను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విచారించగా.. రాజస్తాన్‌లో తయారు చేసి ఇక్కడికి తెచ్చి అమ్ముతున్నట్లు విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భరత్, ఏఎస్సై ఉబెదుళ్ల పాల్గొన్నారు.