
భద్రకాళి ఆలయ హుండీ ఆదాయం రూ.88,41,510
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కించారు. మూడు నెలల 22 రోజులకుగాను రూ.88,41,510 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు. విదేశీ కరెన్సీ 581, యూఎస్‌ఏ డాలర్లు, 20 యూఏ దిరమ్స్, 25 కెనడా డాలర్లు, 11 ఖతర్ సెంట్రల్ బ్యాంక్ రియాల్స్, 20 యూరోలు, 13 మలేషియా రింగెట్స్, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 10 నేపాల్ రూపాయలు లభించినట్లు తెలిపారు. నగదును యూనియన్ బ్యాంకులో జమ చేసినట్లు పేర్కొన్నారు. లెక్కింపునకు పర్యవేక్షణాధికారిగా దేవాదాయశాఖ పరిశీలకులు ధరణికోట అనిల్‌కుమార్ వ్యవహరించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, పర్యవేక్షకులు అద్దంకి విజయ్‌కుమార్‌తోపాటు ఆలయ సిబ్బంది, దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు వీరన్న, సుగుణ, మయూరి, స్రవంతి, పూర్ణచందర్, సతీశ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సభ్యులు, శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి అధ్యక్షులు నవీన్, సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు.
కేయూ పీజీ కోర్సుల
రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం తదితర కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య తెలిపారు. ఈనెల 25, 28, 30, ఆగస్టు 1, 4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ పరిధిలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,628 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
పాఠశాలల్లో లైబ్రరీలను
బలోపేతం చేయాలి
విద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని లైబ్రరీలను బలోపేతం చేయాలని వరంగల్ జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్ తేజ కోరారు. బుధవారం వరంగల్ జిల్లాలోని 44 స్కూల్ కాంప్లెక్స్ పరిధి పాఠశాలల్లో ఇద్దరి చొప్పున 88 మంది రిసోర్స్‌పర్సన్లకు పాఠశాల స్థాయిలో లైబ్రరీల బలోపేతానికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని శంభునిపేట పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుజన్ తేజ మాట్లాడుతూ.. ప్రతీ రోజు కొంత సమయం కేటాయించి గ్రంథాలయంలోని పుస్తకాలను చదివేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. శిక్షణలో కో–ఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు, హెచ్‌ఎం శారదాబాయి, డీఆర్పీలు శైలజ, అశోక్, ఎస్‌ఆర్పీ కుమారస్వామి, సీఆర్పీలు రాధాకృష్ణ, అనిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విమానాశ్రయాలు
త్వరగా నిర్మించాలి
హన్మకొండ: వరంగల్, కొత్తగూడెంలో విమానాశ్రయాల నిర్మాణాలు త్వరగా మొదలు పెట్టాలని మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్ బుధవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలు నిర్మించేందుకు చిత్తశుద్ధితో ఉందని తెలిపినట్లు సీతారాం నాయక్ చెప్పారు. కొత్తగూడెం విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సరైన ప్రదేశాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని, వరంగల్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మంత్రి చెప్పినట్లు వివరించారు. డీపీఆర్ మేరకు 800 ఎకరాలు కేటాయించాల్సి ఉండగా.. 600 ఎకరాలు మాత్రమే కేటాయించారని.. మిగతా కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారన్నారు.

భద్రకాళి ఆలయ హుండీ ఆదాయం రూ.88,41,510