వానా వానా రావమ్మా.. | - | Sakshi
Sakshi News home page

వానా వానా రావమ్మా..

Jul 25 2025 4:17 AM | Updated on Jul 25 2025 4:17 AM

వానా వానా రావమ్మా..

వానా వానా రావమ్మా..

సాక్షిప్రతినిధి, వరంగల్‌: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఇంకా ఊరటనివ్వడం లేదు. గురువారం నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లాలో ఒక్క రోజే 10 మిల్లీమీటర్ల సాధారణ వర్షాపాతానికి 39.3 మి.మీటర్ల వర్షం కురిసింది. అయితే జిల్లాలో సాధారణ వర్షపాతం 337.10 మిల్లీమీటర్లకుగాను 316.3 మి.మీటర్లుగా నమోదు కాగా.. మొత్తం 6.0 మి.మీటర్ల లోటు ఉంది. మొత్తం 14 మండలాలకుగాను నాలుగు మండలాల్లో ఇంకా వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి. ఎనిమిది మండలాల్లో సాధారణ వర్షపాతమే ఉండగా.. భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. భీమదేవరపల్లిలో 270.8 మి.మీ.లకు 357.8 (32 శాతం) మి.మీ.లు, వేలేరులో 267.6 మి.మీ.లకు 353.6 (32 శాతం) మి.మీ.ల అధిక వర్షం కురిసింది. ఎల్కతుర్తి, హసన్‌పర్తి, ఐనవోలు, దామెర మండలాల్లో లోటు వర్షపాతం రికార్డు కాగా.. కమలాపూర్‌, ధర్మసాగర్‌, కాజీపేట, హనుమకొండ, ఆత్మకూరు, శాయంపేట, నడికూడ, పరకాల మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా.. వాతావరణశాఖ సూచనల మేరకు జేఎస్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, జనగామ జిల్లాలతోపాటు హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

ఇంకా నాలుగు మండలాల్లో

లోటు వర్షపాతం

8 మండలాల్లో సాధారణం..

భీమదేవరపల్లి, వేలేరులో అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement