
మల్లారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సందర్శన
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం మల్లారంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని వైద్య నాణ్యత ప్రమాణాల సూచిక అధికారులు గురువారం సందర్శించారు. ఈసందర్భంగా అధికారులు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లోని నాణ్యత ప్రమాణాలు, రోగులకు అందిస్తున్న మెరుగైన వైద్య సేవలు, మెడిసిన్ నిల్వలు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ అప్పయ్య, జిల్లా క్వాలిటీ మేనేజర్ సాగర్ మాట్లాడుతూ... మల్లారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (పల్లె దవాఖానా)కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనున్నట్లు తెలిపారు. తాజాగా నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికెట్ కోసం జాతీయ స్థాయి సభ్యులతో ఆన్‌లైన్ ద్వారా మూల్యాంకనం జరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా (పల్లె దవాఖాన) ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని సందర్శించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ప్రదీప్‌రెడ్డి, నివేదిత, సూపర్‌వైజర్లు రత్నభారతి, రాజయ్య, రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
వేలేరు: ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులు ఫార్మసీ, డయాగ్నోస్టిక్ హబ్‌కు పంపించే శాంపిళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి పరిసరాల్లో సిబ్బందితో కలిసి పిచ్చి మొక్కలను, వ్యర్థాలను తొలగించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైధ్యాధికారి డాక్టర్ మేఘన, హెచ్‌ఈఓ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్‌వైజర్ కూమారస్వామి, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.