
శ్రావణ సందడి షురూ..
జిల్లాలో శ్రావణ మాసోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోని ఆలయాలు కిటకిటలాడాయి. భక్తులు ఉదయాన్నే సమీప ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చన చేశారు. శ్రావణ మాసంలో శుభకార్యాలు ప్రారంభమవుతాయని, ఆలయాల్లో పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు పేర్కొన్నారు.
– సాక్షి, నెట్‌వర్క్
వరంగల్ ఎంజీఎం ఎదుట ఉన్న రాజరాజేశ్వరి ఆలయంలో
సామూహిక వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్న మహిళలు