
పొద్దంతా వర్షం..
నర్సంపేట: జిల్లాలో శుక్రవారం పొద్దంతా కురిసిన వర్షంతో చెరువులు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. పాకాల, రంగాయ, మాదన్నపేట, కోపాకుల, కోనారెడ్డి, ఎల్గూరు చెరువుల్లో నీరు భారీగా చేరుతోంది. పాకాల సరస్సులో 24 ఫీట్లు, మాదన్నపేట చెరువులో 13.5 అడుగులకు నీటిమట్టం చేరింది. తెల్లవారే వరకు మరింత పెరిగే అవకాశం ఉంది. చెరువులు, కుంటల కింద రైతులు తమ పొలాలను ట్రాక్టర్లు, నాగళ్లతో దున్నిస్తూ కూలీలతో వరి నాట్లను వేయిస్తున్నారు. పత్తి, పసుపు, మొక్కజొన్న, వేరుశనగతో పాటు ఇతర పంటలకు ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3.10 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. 1.45 లక్షల ఎకరాల్లో వరిపంట సాగవుతోంది.
హైవేపై వరదనీరు
భారీ వర్షానికి ఎన్‌హెచ్–365పై వరదనీరు ప్రవహించింది. దీంతో నర్సంపేటలోని అంబేడ్కర్ సెంటర్‌లో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని సంవత్సరాల క్రితం వర్షపునీరు నిల్వకుండా పనులు చేపట్టారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికై నా మున్సిపల్, నేషనల్ హైవే అధికారులు స్పందించి నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వర్షపాతం వివరాలు..
జిల్లాలో శుక్రవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. నెక్కొండలో 56.3 మిల్లీమీటర్లు, చెన్నారావుపేటలో 50.8, గీసుకొండ మండలం గొర్రెకుంటలో 47.5, గీసుకొండలో 44.3, పర్వతగిరి మండలం కల్లెడలో 42.3, కాశిబుగ్గలో 41, వరంగల్ ఉర్సులో 37.3, నర్సంపేట మండలం లక్నెపల్లిలో 36.3, వరర్ధన్నపేటలో 35.8, సంగెం మండలం కాపులకనపర్తిలో 34.3, సంగెంలో 33.3, ఖానాపురం మండలం మంగళవారిపేటలో 32.5, పర్వతగిరి మండలం ఏనుగల్లులో 21.5, నెక్కొండ మండలం రెడ్లవాడలో 21, దుగ్గొండిలో 17, నల్లబెల్లి మండలం మేడపల్లిలో 12.3, వరంగల్ పైడిపల్లిలో 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మత్తడి పోస్తున్న దుగ్గొండి పెద్ద చెరువు
దుగ్గొండి: మండలంలో కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది. మండల పరిధిలో 14 పెద్ద చెరువులు 90 చిన్న నీటి కుంటలు ఉండగా.. శుక్రవారం సాయంత్రం నుంచి దుగ్గొండి పెద్ద చెరువు జలకళ సంతరించుకుని మత్తడి పోస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చెరువుల్లో చాలా తక్కువగా నీరు చేరింది.
నిండుతున్న చెరువులు..
నెక్కొండ: వర్షాలు కురుస్తుండడంతో చెరువులు నిండుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి నెక్కొండ మండలంలోని పత్తిపాక చెరువు మత్తడిపోస్తోంది. మండలంలోని పలు చెరువులు రెండుమూడు రోజుల్లో మత్తడి పోసేందుకు సిద్ధం ఉన్నాయి.
చెరువులు, కుంటల్లో చేరుతున్న నీరు
పాకాల సరస్సులో 24 ఫీట్ల నీటిమట్టం

పొద్దంతా వర్షం..

పొద్దంతా వర్షం..

పొద్దంతా వర్షం..

పొద్దంతా వర్షం..