
రైతులు ఆందోళన చెందొద్దు
దుగ్గొండి: పంటలకు సరిపడా యూరియా నిల్వ లు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయ జేడీఏ బాలునాయక్ అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్‌లో యూరియా అమ్మకాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. రైతుల పంపిణీ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పంట విస్తీర్ణాన్ని బట్టి రైతులకు యూరియా అందించాలని సిబ్బందికి సూచించారు. నెలవారీ ప్రణాళిక ప్రకారం యూరియా అందించనున్నట్లు వివరించారు. నిల్వ ఉంచిన యూరియాలో నత్రజని ఆవిరైపోతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ దామోదర్‌రెడ్డి, ఏఓ మాధవి, ఏఈఓలు హన్మంతు, విజయ్, రాజేశ్, వైజయంతి, సీఈఓ భిక్షపతి, రైతులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్
స్పెషలాఫీసర్‌గా శశాంక
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్‌గా ఐఏఎస్ అధికారి కె.శశాంక నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌కు 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శశాంక పేరును ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆయన గతంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఇటీవల ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీకి కమిషనర్‌గా నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ (ఫ్రెష్, రెన్యూవల్)ల కోసం బీసీ, ఓబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎ.పుష్పలత ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి అర్హులైన విద్యార్థులు www.telanganaepass.cgg. gov.inలో సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు హనుమకొండ లష్కర్‌బజార్ బీసీ స్టడీసర్కిల్ ఆవరణలోని కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.
అంబేడ్కర్ ఓవర్సీస్ పథకానికి..
న్యూశాయంపేట: విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి నిరుపేద ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి.భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపా రు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్‌కొరియా దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే వారికి ఈ పథకం కింద రూ.20 లక్షల స్కాలర్‌షిప్ మంజూరు చేస్తారని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు www.telanganaepass.cgg.gov.in ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు హనుమకొండ సుధానగర్ కాలనీలోని కార్యాలయంలో సంప్రదించాలని ఆమె సూచించారు.
చైన్‌స్నాచర్ అరెస్ట్
పర్వతగిరి: చైన్‌స్నాచర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌లో సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్ శుక్రవారం వివరాలను వెల్లడించారు. ఈనెల 7న చింతనెక్కొండ గ్రామ శివారులో డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతున్న మహిళ మెడలో నుంచి ఇద్దరు పుస్తెలతాడు అపహరించారు. కేసు నమోదు చేసి గురువారం నెల్లికుదురు మండలం ఔసలితండాకు చెందిన మౌర్య నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు పేర్కొన్నారు. జల్సాలకు అలవాటు పడి చైన్‌స్నాచింగ్ చేశామని నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. అతడి నుంచి 34 గ్రాముల పుస్తెలతాడు, ద్విచక్ర వాహనం, ఫోన్ రికవరీ చేసినట్లు వివరించారు. మరో నిందితుడు మౌర్య హేమంత్‌ది కూడా ఇదే గ్రామమని తెలిపారు.

రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు