విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

Jul 26 2025 9:36 AM | Updated on Jul 26 2025 9:36 AM

విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

మామునూరు: విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్‌ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్‌ మండలం మామునూరు జవహర్‌ నవోదయ విద్యాలయంలో రూ.50 లక్షల పీఎం శ్రీనిధి నిధులతో నిర్మించిన కృత్తిమ మేధో ఆధునిక సాంకేతిక నైపుణ్యాభివృద్ధి (సంకల్ప్‌) ల్యాబ్‌ను కలెక్టర్‌ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు ప్రత్యేకమైన ప్రయోగశాలను పీఎం శ్రీ పాఠశాలల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈల్యాబ్‌లో విద్యార్థులు రోబోటిక్స్‌ ఐఓటీ, బేసిక్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, రెన్యువల్‌ ఎనర్జీ సిస్టం వంటి అంశాలను ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలని కోరారు. అంతకు ముందు కలెక్టర్‌ సత్యశారద నవోదయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పూర్ణిమ, ఉపాధ్యాయులు సురేశ్‌, రామలింగయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల నివారణకు చర్యలు

న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణితో కలిసి శుక్రవారం జిల్లాస్థాయి నార్కోటిక్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు గంజాయి వినియోగించకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు. సమీక్షలో జిల్లా అధికారులు రాంరెడ్డి, జ్ఞానేశ్వర్‌, రాజమణి, సాంబశివరావు, పోలీసులు, నార్కోటిక్‌ అధికారులు పాల్గొన్నారు.

రాత పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

గ్రామపాలన అధికారి, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ రాత పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామపాలన అధికారి పరీక్షకు 25 మంది, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ పరీక్షకు 304 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఈనెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వరంగల్‌ ఏవీవీ జూనియర్‌, డిగ్రీ కళాశాలలో వీఆర్‌ఓ పరీక్ష, ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, తిరిగి రెండు గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు సర్వేయర్‌ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

భవనాలకు మరమ్మతులు చేయాలి..

వరంగల్‌ పోచమ్మమైదాన్‌లోని బల్దియా వార్డు ఆఫీస్‌ పైఅంతస్తులో టాస్క్‌ (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌) ఐటీ శిక్షణ కేంద్రం ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని, వరంగల్‌ తూర్పు పరిధిలోని కమ్యూనిటీ రిసోర్స్‌ సెంటర్స్‌, మహిళా స్వశక్తి భవనాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు.

కలెక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement