
వేయిస్తంభాల ఆలయంలో మాస శివరాత్రి పూజలు
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఆషాఢ బహుళ త్రయోదశి యుక్త చతుర్దశి బుధవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివ కల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు మణికంఠశర్మ, అర్చకుడు ప్రణవ్, సందీప్‌శర్మ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి, శ్రీరుద్రేశ్వరస్వామికి పంచామృత రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో రుద్రేశ్వరీదేవి, రుద్రేశ్వరస్వామివారిని ప్రతిష్టించి కల్యాణోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు.
న్యూస్‌రీల్

వేయిస్తంభాల ఆలయంలో మాస శివరాత్రి పూజలు