
చాడ సరిత సేవలు మరువలేనివి
వేలేరు: బీఆర్‌ఎస్ పార్టీకి మాజీ జెడ్పీటీసీ చాడ సరిత అందించిన సేవలు మరువలేనివని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. చాడ సరిత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం మల్లికుదుర్లలోని ఆమె నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో హుజూరా బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, బీఆర్‌ఎస్ నాయకులు రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.