
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
నర్సంపేట రూరల్: ఎరువులు, పురుగు మందులు రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసె న్స్‌లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ హెచ్చరించారు. నర్సంపేట పట్టణంలోని పలు ఎరువులు, పురుగు మందుల షాపులను శనవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ డీలర్లు గడవుతీరిన పురుగు మందులను రైతులకు విక్రయించొద్దని, ఎరువులను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ వ్యవసాయాఽధికారి శశికాంత్, వ్యవసాయ విస్తరణాధికారి మెండు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నానో యూరియా, డీఏపీతో
అధిక ప్రయోజనాలు
● వరంగల్ ఏరువాక కేంద్రం
శాస్త్రవేత్త నాగభూషణం
దుగ్గొండి: పంటలకు నానో యూరియా, డీఏపీ వాడితే అధిక ప్రయోజనాలు ఉంటాయని వరంగల్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త నాగభూషణం అన్నారు. మండలంలోని నాచినపల్లి గ్రామంలో ఏరువాక– రైతు సాగుబడిపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంట పొలాలకు వేసే యూరియా, డీఏపీ 40 శాతం వరకు వృథాగా పోవడంతో పాటు భవిష్యత్‌లో భూమి నిస్సారంగా మారుతుందని అన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా నానో డీఏపీ, నానో యూరియా వాడాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేసే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. పత్తి, మొక్కజొన్న పంటల్లో తెగుళ్లు, నివారణ చర్యలను వివరించారు. సదస్సులో జాతీయ ఆహార భద్రతా మిషన్ ప్రతినిధి సారంగం, ఏఓ మాధవి, ఏఈఓ విజయ్‌నాయక్, నాచినపల్లి, పొనకల్ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
కిరాణా దుకాణంలోకి
దూసుకెళ్లిన మినీట్రాక్టర్
● ఇద్దరికి తీవ్ర గాయాలు,
రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసం
నర్సంపేట రూరల్: కిరాణా దుకాణంలోకి మినీ టాక్ట్రర్ దూసుకెళ్లిన ఘటన నర్సంపేట పట్ట ణంలోని మల్లంపల్లి రోడ్డులో శనివారం జరి గింది. స్థానికుల కథనం ప్రకారం.. నాగుర్లపల్లి గ్రామాన్ని ఇటీవల నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. అయితే, గ్రామపంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్‌ను నర్సంపేటలో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్నారు. ఈక్రమంలో శనివారం చెత్త సేకరణలో భాగంగా మల్లంపల్లి రోడ్డు వైపు డ్రైవర్ ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. వేగంగా వచ్చి కిరాణా డబ్బాలోకి దూ సుకెళ్లింది. డబ్బాలో ఉన్న స్వాతి కాలు విరిగి పోయింది. పక్కనే ఉన్న రాజుకు తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ట్రాక్టర్ సైతం బోల్తా పడింది. విషయం తెలుసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు.