ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి

Jul 4 2025 3:28 AM | Updated on Jul 4 2025 3:28 AM

ఫార్మ

ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి

నెక్కొండ: వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్‌ చేయాలనే లక్ష్యంలో భాగంగా రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అగ్రిస్టాక్‌ తెలంగాణ ఫార్మర్‌ ఈ రిజిస్ట్రీలో రైతుల భూముల వివరాలను నమోదు చేస్తోంది. పథకాల అమలుకు ప్రతీ రైతు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఆర్‌) చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. మే 5 నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. వ్యవసాయశాఖ సిబ్బంది తమ క్లస్టర్ల పరిధిలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌కు శ్రీకారం చుట్టింది. కాగా, నమోదు ప్రక్రియలో జిల్లాలోనే నెక్కొండ మండలం ముందంజలో ఉంది.

పీఎం కిసాన్‌ అందాలంటే..

రైతుల భూములకు సంబంధించిన వివరాలతో కూ డిన సమాచారాన్ని పొందుపరచనున్నారు. రెవె న్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వి వరాలను రైతు ఆధార్‌కార్డుకు అనుసంధానం చేసి న ఫార్మర్‌ ఐడీని కేటాయిస్తారు. పీఎం కిసాన్‌ లబ్ధి దారులు తదుపరి విడత లబ్ధి పొందేందుకు ప్రామాణికంగా ఫార్మ రిజిస్ట్రేషన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఫార్మర్‌ ఐడీని పొందుటకు ఆధార్‌కు లింక్‌ చేసిన మొబైల్‌ నంబర్‌ను తీసుకొని సమీపంలోని వ్యవసాయ విస్తీర్ణాధికారిని సంప్రదించాలి.

యాప్‌లో సాంకేతిక సమస్య..

జిల్లాలో మొత్తం 1,58,177 మంది రైతులు ఉన్నారు. ఇప్పటి వరకు 58,149 (36.76 శాతం) మంది రైతుల వివరాలను ఏఈఓలు యాప్‌లో నమోదు చేశారు. క్లస్టర్ల పరిధిలోని గ్రామాల వారీగా ఏఈఓలు ప్రతి రోజు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ రైతుల వివరాలను సేకరిస్తున్నారు. రైతు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకంలోని భూముల వివరాలు, యాప్‌లో నమోదు చేయగానే 11 నంబర్ల ప్రత్యేక యానిక్‌ కోడ్‌ కేటాయిస్తున్నారు. అయితే యాప్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో రైతుల వివరాలను నమోదు చేసేందుకు ఏఈఓలు పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు చెందిన భూముల సమాచారం యాప్‌లో కనిపించకపోవడంతో వివరాలను నమోదు చేసే ప్రక్రియలో జాప్యం అవుతోంది. అదేవిధంగా రైతుల సెల్‌ఫోన్లలో ఓటీపీ నంబర్‌ రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఆధార్‌కు లింక్‌ చేసిన ఫోన్‌ నంబర్లను రైతులు వాడకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఏఈఓలు పేర్కొంటున్నారు.

రైతులకు 11 నంబర్ల యూనిక్‌ కోడ్‌ కేటాయింపు

క్లస్టర్ల వారీగా యాప్‌లో

నమోదు చేస్తున్న ఏఈఓలు

గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన

వ్యవసాయ శాఖ

రిజిస్ట్రేషన్‌లో నెక్కొండ

మండలం ముందంజ

జిల్లాలో రైతులు, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతుల వివరాలు..

మండలం రైతులు రిజిస్ట్రేషన్‌

చేసుకున్న

రైతులు

నెక్కొండ 14,894 7,551

వర్ధన్నపేట 14,015 6,264

సంగెం 14,996 6,393

నర్సంపేట 12,003 4,457

వరంగల్‌ 2,061 747

రాయపర్తి 19,360 6,932

పర్వతగిరి 14,341 5,116

చెన్నారావుపేట 11,417 3,813

గీసుకొండ 13,343 4,351

ఖిలా వరంగల్‌ 5,183 1,689

దుగ్గొండి 14,405 4,677

నల్లబెల్లి 1,3459 3,912

ఖానాపురం 8,700 2,247

మొత్తం 1,58,177 58,149

జిల్లాలో రెండు వ్యవసాయ డివిజన్లు..

జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి. మొత్తం క్లస్టర్ల సంఖ్య 53. జిల్లాలో సాగు భూమి విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలు. రైతుల 1,58,177 మంది ఉన్నారు.

నమోదు ప్రక్రియ కొనసాగుతోంది..

జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. క్లస్టర్ల వారీగా ఏఈఓలు అన్ని గ్రామాల్లో యాప్‌లో నమోదు చేస్తున్నారు. గడువుకు ముందే రైతులందరి వివరాలను నమోదు చేయాలనే లక్ష్యంతో ఏఈఓలు పనిచేస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో వివరాల నమోదులో జాప్యం ఏర్పడుతోంది.

– కె.అనురాధ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి1
1/2

ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి

ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి2
2/2

ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement