
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
● డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య
నడికూడ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య అన్నారు. బుధవారం మండలంలోని రాయపర్తి పీహెచ్‌సీ పరిధి నార్లాపూర్, చర్లపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. నార్లపూర్ సబ్ సెంటర్‌లో విద్యుత్ సౌకర్యం లేదని సిబ్బంది తెలుపగా, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం రాయపర్తి పీహెచ్‌సీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్య, ఏఎన్‌ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.