
డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు
హసన్‌పర్తి: ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్‌బస్సుల డ్రైవర్‌లకు ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని ఫాతిమా సెంటర్ వద్ద డ్రంకెన్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ముందస్తు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. తనిఖీల్లో కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్నతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.