
చెట్లతోనే మనిషి మనుగడ
పరకాల: మొక్కలు నాటడంతో పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పరకాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి జి.సాయి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా పరకాల కోర్టు ఆవరణలో గురువారం మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిపై పుట్టిన ప్రతీ జీవి మనుగడకు చెట్లు ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. కార్యక్రమంలో పరకాల కోర్టు ఏజీపీ మేరుగు శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు ఓంటేరు రాజమౌళి, వి.చంద్రమౌళి, గండ్ర నరేశ్‌రెడ్డి, పి.వేణుయాదవ్, కోర్టు సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పరకాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి జి.సాయి
పరకాల కోర్టులో వన మహోత్సవం