స్కూళ్లలో టీచర్ల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ | - | Sakshi
Sakshi News home page

స్కూళ్లలో టీచర్ల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌

Jul 17 2025 3:09 AM | Updated on Jul 17 2025 3:09 AM

స్కూళ్లలో టీచర్ల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌

స్కూళ్లలో టీచర్ల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ కసరత్తు ముగిసింది. హనుమకొండ జిల్లాలో విద్యార్థులు లేని 41 పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాటలో భాగంగా స్వలంగా విద్యార్థులు చేరగా.. 9 పాఠశాలలను తెరిచారు.

సమీప మండలాల నుంచి కూడా సర్దుబాటు

జిల్లాలోని 14 మండలాల్లో ఎంఈఓలు.. ఏ మండల పరిధిలోని టీచర్లు ఆ మండల పరిధిలో వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసేందుకు కసరత్తు చేశారు. ఉదాహరణకు హనుమకొండలో పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండి సబ్జెక్టు టీచర్ల కొరత ఉంటే సమీప మండలాల నుంచి కూడా సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి నుంచి 10 మంది వరకు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకు ఒక టీచర్‌ చొప్పున, 11 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు టీచర్లు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు టీచర్లు, 121 నుంచి 150 మంది ఉంటే ఐదుగురు 151 నుంచి 200 మంది విద్యార్థులు, ఆపైన విద్యార్థులు ఉంటే కూడా టీచర్లు అదనంగా ఇచ్చేలా సర్దుబాటు చేశారని సమాచారం.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా..

సింగిల్‌ టీచర్‌ ఉన్న ప్రాథమిక పాఠశాలలకు అవసరమైతే మరో టీచర్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా యూపీఎస్‌, హైస్కూళ్లలో కూడా సర్దుబాటు చేశారని సమాచారం. ఉదాహరణకు హనుమకొండ సుబేదారి హైస్కూల్‌లో ముగ్గురు సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్లు ఉంటే అందులో ఒకరిని హనుమకొండలోని మరో ప్రభుత్వ హైస్కూల్‌కు సర్దుబాటు చేశారని తెసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూల్‌ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారని తెలుస్తోంది. అలాగే, పలువురు ఎస్‌జీటీలను కూడా అవసరం ఉన్న హైస్కూళ్లకు కేటాయించినట్లు సమాచారం.

వరంగల్‌ జిల్లాలో కసరత్తు

వరంగల్‌ జిల్లాలో 13 మండలాల్లో టీచర్ల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌పై సంబంధిత ఎంఈఓలు కసరత్తు చేస్తున్నారు. పలువురు ఎంఈఓలు తమ మండల పరిధిలో టీచర్ల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసి జాబితాలను డీఈఓ కార్యాలయానికి పంపారు. కొన్నిమార్పులు చేయాలనే ఉన్నతాధికారుల సూచనతో ఇంకా కసరత్తు జరగుతోందని సమాచారం. జిల్లాలో 135 జీరో విద్యార్థుల సంఖ్య ఉన్న స్కూళ్లు ఉండగా.. అందులో ఈవిద్యాసంవత్సరంలో బడిబాట ద్వారా 7 పాఠశాలలు తెరుచుకున్నట్లు తెలు స్తోంది. ఇంకా ఈప్రక్రియ మరో రెండు మూడు రోజులకు పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కలెక్టర్‌ అప్రూవల్‌ తర్వాత ఉత్తర్వులు..

హనుమకొండ జిల్లాలోని మొత్తం 140 మంది టీచర్లను పాఠశాలల్లో సర్దుబాటు చేశారని సమాచారం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చేసి ఎంఈఓలు ఫైల్‌ను డీఈఓ కార్యాయానికి పంపగా.. డీఈఓ పరిశీలించి కలెక్టర్‌ అప్రూవల్‌కు మంగళవారం ఫైల్‌ను పంపించారని తెలుస్తోంది. కలెక్టర్‌ పరిశీలించి అప్రూవల్‌ చేశాకే రెండు మూడు రోజుల్లో వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌కు సంబంధించి డీఈఓ ద్వారా ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.

జిల్లాలో 140 మంది సర్దుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement