ఒకేసారి అక్కాచెల్లెళ్లిద్దరికి.. | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి అక్కాచెల్లెళ్లిద్దరికి..

Oct 5 2023 1:44 AM | Updated on Oct 5 2023 11:30 AM

- - Sakshi

ప్రత్యూష, వినూష

వరంగల్‌: అక్కాచెల్లెళ్లు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మర్థ శ్రీనివాస్‌–అంజలికి ప్రత్యూష, వినూష కుమార్తెలు ఉన్నారు. కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించి పరీక్షలు రాశారు. ఇందులో ఓపెన్‌ కేటగిరీలో ఇద్దరు 111 మార్కులు సాధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని అభినందించారు. కాగా, మండల పరిధిలో పలువురు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement