మాట్లాడుతున్న కొండేటి శ్రీధర్
కాళోజీ సెంటర్: ధర్మారం–నర్సంపేట రోడ్డులో బీజేపీ జిల్లా నూతన కార్యాలయ భవనాన్ని ఈనెల 31న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రారంభిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తెలిపారు. వరంగల్ శివనగర్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 31న ఉదయం 6–30 గంటలకు నవగ్రహ, గణపతి పూజ, లక్ష్మీగణపతి హోమం, వాస్తుపూజ నిర్వహించి.. 12–30 గంటలకు నడ్డా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్, కిసాన్ మోర్చా నాయకుడు మల్లాడి తిరుపతిరెడ్డి, ప్రచార కార్యదర్శి బైరి శ్యాంసుందర్, నాయకులు గాడిపెల్లి రాజేశ్వర్‌రావు, కలువల త్రిలోక్, ఒంటెల ప్రసాద్, కారంపొడి ఉమేష్ తదితరలు పాల్గొన్నారు.


